Happy Birthday Lucky
అసలు ఎక్కడ మొదలుపెట్టాలో..,
ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియట్లేదు..!
ఎందుకొచ్చావో తెలీదు కానీ..,
నీతో గడిపే ప్రతి క్షణం నా జ్ఞాపకాల బరువుని పెంచుతూనే ఉంది..!
ఎప్పుడు కనపడ్డావో తెలీదు కానీ..,
నా గతమంతా నీతో చెప్పిన సంభాషనలే ఉన్నాయి...!
ఎక్కడాపానో నా ఒంటరి నడకని తెలీదు కానీ..,
నీతో నడిచిన అడుగులు మాత్రమే కనపడుతున్నాయి..!
ఏమిచ్చిందో తెలీదు కానీ నీతో ఈ ప్రయాణం..,
వెన్నెల్లో చందమామని వెతికేంత అమయకాన్ని మాత్రం ఇచ్చింది..!
ఎంత మందిని కలిసానో తెలీదు కానీ..,
నిన్ను కలిసాకే నన్ను నేను వెతకడం మొదలు పెట్టా..!
ఎలా ఎదురయ్యామో తెలీదు కానీ..,
ఎంత దూరమున్నా ఇద్దరం ఒక్కటే అనేంత దగ్గరయ్యాం..!
మన ఈ చిన్ని ప్రపంచంలో అంత పెద్ద ప్రేమ ఎలా పట్టిందో తెలీదు కానీ..,
ఎంత పెద్ద ప్రపంచాన్నైనా మన ఈ చిన్ని ప్రేమతో గెలుద్దాం..!
ఇంకా..,
ఎప్పుడైనా చెప్పానా..?
నువ్వు అంటే ఎంత ఇష్టమో.., బహుశా చెప్పలేనంతేమో..!
ఎప్పుడైనా చెప్పగలిగానా..?
నువ్వు లేని నేను.., నేను లేని నాతో సమానమని..!
చెప్పాలంటే నిన్ను బాధించే వాళ్ళందరి మీదా నాకు కోపమే..,
అందుకే ఒక్కోసారి నా మీద నాకే కోపం..!
నిజానికి నీ ప్రతి క్షణం నాదే అవ్వాలనే స్వార్ధం కంటే..,
నీ ఒంటరిలో నేను తోడుంటే చాలనిపిస్తుంది చాలాసార్లు...!
చెప్తే నవ్వుతవేమో కానీ..,
నీతో నడుస్తుంటే గాల్లో తెలుతున్నట్లు ఉంటది..,
కానీ నా తపనంత నిన్ను గాల్లో తిప్పాలనే...!
ఎవరు రాస్తారో ఈ బంధాలన్ని తెలీదు కానీ..,
నీతో ఈ బంధానికి ముగింపు రాయలేదని ఆశిస్తూ...,
దొరగారి సొగసరికి పుట్టినరోజు శుభాకాంక్షలు...!
ఇట్లు,
నీ దొరగారు.